వరద ప్రభావిత ప్రాంతాలపై ఆరా
మంత్రులు నాదెండ్ల..అచ్చెన్న సమీక్ష
అమరావతి – రాష్ట్రంలో చోటు చేసుకున్న వరదల కారణంగా బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ సమీక్ష చేపట్టారు.
గురువారం సచివాలయంలో వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర వస్తువులు, ఆహారం సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన మేరకు సాయం అందజేస్తామని ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్ లో సివిల్ సప్లైస్, పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రజలకు ఏ దశలోనూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. చాలా మందిని పునరావాస ప్రాంతాలకు చేరవేశామని, ఆహారం, పాలు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రులు, ఉన్నతాధికారులు పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, మనోహర్.