చంద్రబాబు పనితీరు భేష్ – చినజీయర్
సీఎం పరిపాలనా విధానం అద్బుతం
అమరావతి – ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లులు కురిపించారు.
వరదల కారణంగా అతలాకుతలమైన ఏపీని సందర్శించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ. ఈ సందర్బంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
ఈ వయసులో ఎవరైనా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటారు. కానీ సీఎం అలా కాదు నేటి యువతీ యువకులతో పోటీ పడుతూ వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తూ , సహాయక చర్యలు ముమ్మరం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ.
ఈ విపత్కర సమయంలో గత 5 రోజులుగా చంద్రబాబు రేయింబవళ్లు శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం అభినందనీయమని అన్నారు. ఆయన ఓపిక, శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ.