ప్రశ్నించడం ప్రజాస్వామంలో సాధారణం
ఆధారాలు లేకుండా అరెస్ట్ లు చెల్లవు
హైదరాబాద్ – ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణమని ఇది తెలుసుకుంటే ప్రభుత్వానికి మంచిదని స్పష్టం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు, ఇంటలెక్చువల్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి.
శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఇంకో వైపు తప్పులను ఎత్తి చూపుతూ వస్తున్న వారి పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
డెమోక్రసీలో ప్రశ్నించడం అన్నది ముఖ్యమని, దానిని అడ్డుకోవాలని చూస్తే చివరకు ఇబ్బంది పడేది మీరేనంటూ స్పష్టం చేశారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి.
ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదని పోలీసులకు సూచించారు. ఆయన తాజాగా తమ పార్టీకి చెందిన తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ చీఫ్ కొణతం దిలీప్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని తప్పు పట్టారు.
బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో దిగి వచ్చారని, చివరకు విడుదల చేశారని తెలిపారు. ఇకనైనా ప్రశ్నించే వారిని, ప్రధానంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు.