NEWSANDHRA PRADESH

వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం – సీఎం

Share it with your family & friends

విద్యుత్ బిల్లులు..బ‌కాయిల వ‌సూలు వాయిదా

అమరావ‌తి – రాష్ట్రంలో చోటు చేసుకున్న వ‌ర‌ద స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. నిత్యావ‌స‌ర సరుకుల పంపిణీపై ఆరా తీశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభవార్త చెప్పారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఒక నెల వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు.

వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపిస్తామ‌ని, అనంతరం సమగ్ర నివేదిక అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు సీఎం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించామ‌ని చెప్పారు.

మూడు రోజుల్లో నిత్యావసరాల కిట్లు పంపిణీ పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వరదల వల్ల భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ప్రకాశం బ్యారేజీని బలోపేతం చేస్తున్నామన్నారు.