జిట్టా మరణం బాధాకరం – సీఎం
సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు మిత్రుడని, ఆయన అకాల మరణం తనను మరింత బాధకు గురి చేసిందని తెలిపారు సీఎం.
యువతను ఐక్యం చేయడంలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెడ్డి ఇప్పుడు లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆయన తనకు ఆత్మీయుడని, ఎన్నో సందర్బాలలో తాము కలుసుకున్నామని తెలిపారు.
ఈ సందర్బంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.