రైల్వే ఉద్యోగానికి వినేష్ ఫోగట్ రాజీనామా
వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నా
హైదరాబాద్ – ప్రముఖ రెజ్లర్ వినేశ్ పోగట్ సంచలన ప్రకటన చేశారు. తను జాబ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు భారతీయ రైల్వే శాఖకు తన రాజీనామా లేఖను పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా తనకు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు వినేశ్ ఫోగట్. ప్రధానంగా భారతీయ రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో మరపురాని , గర్వించదగిన సమయమని తెలిపారు .
ఈ సమయంలో తాను రైల్వే సేవ నుండి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు వినేశ్ ఫోగట్. భారతీయ రైల్వే ఉన్నతాధికారులకు తాను రాజీనామా లేఖను సమర్పించడం జరిగిందని తెలిపారు.
దేశ సేవలో రైల్వే నాకు ఇచ్చిన ఈ అవకాశం కోసం భారతీయ రైల్వే కుటుంబానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు వినేశ్ ఫోగట్. ఇదిలా ఉండగా త్వరలో జరిగే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.