చెర్రీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
డిసెంబర్ 20న కానున్నట్టు సమాచారం
హైదరాబాద్ – ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఈ మేరకు అధికారికంగా వచ్చే డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు. శర వేగంగా చిత్రీకరణ పూర్తయింది. ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల రీత్యా వాయిదా వేశారు.
ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసేందుకు దర్శకుడికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు నిర్మాత దిల్ రాజు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ తదుపరి చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో రానుంది. ఇప్పటికే కొత్త చిత్రానికి సంబంధించి కథపై చర్చలు కూడా జరిగినట్లు టాక్. బుచ్చిబాబు తీసిన ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక రామ్ చరణ్ తో తీయబోయే మూవీ ఎలా ఉంటుందోనని మెగా ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. మొత్తంగా శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ చెర్రీకి బిగ్ సక్సెస్ ఇవ్వనుందా అనేది తేలనుంది డిసెంబర్ నెలలో.