వైఎస్ ఫ్యామిలీ వల్లే బుడమేరుకు వరద
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కామెంట్స్
అమరావతి – ఓ వైపు వరదలు ముంచెత్తుతున్న వేళ మరో వైపు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయినా ఇంకా ఏపీ తల్లడిల్లుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి. మరో వైపు గోదావరి, కృష్ణాతో పాటు బుడమేరు నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ఇంకా ప్రమాద పరిస్థితులలోనే నగర వాసులు కొనసాగుతున్నారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఉంటున్నారు.
ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. బుడమేరు వరదలు రావడానికి వైఎస్ కుటుంబమే ప్రధాన కారణమని, లేక పోతే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు కొలికెపూడి శ్రీనివాస రావు.
వైఎస్ రాజారెడ్డి వియ్యంకుడి వల్లే బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు ఆగి పోయిందంటూ ఆరోపించారు . ఆనాడు త్వరితగతిన నిధులు కేటాయించి ఉంటే, ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ బుడమేరుకు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు కొలికపూడి శ్రీనివాస రావు.