శరవేగంగా బుడమేరు పూడిక పనులు
స్పష్టం చేసిన మంత్రి రామానాయుడు
విజయవాడ – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం బుడమేరుకు పడిన గండ్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు కూడా ఉన్నారు.
అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మట్లాడారు. బుడమేరు గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా విజయవాడ సింగ్ నగర్ కు వరద ముంపును నియంత్రించేలా మూడో గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లతో కలసి పర్యవేక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు.