బాబు నివాసం కోసం బెజవాడను ముంచేశారు
రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బా రెడ్డి కామెంట్స్
అమరావతి – వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాని వెనుక వైసీపీ ఉందంటూ టీడీపీ అబద్దపు ప్రచారం చేస్తోందని అన్నారు. శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మొదటి నుంచి అభాండాలు వేయడం, అసత్య ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు వరదల దెబ్బకు ఏపీ అతలాకుతలం అయిపోతే సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాల్సిన టీడీపీ పరివారం పనిగట్టుకుని వైసీపీపై, తమ పార్టీ చీఫ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైవీ సుబ్బా రెడ్డి.
ఏపీలో ప్రస్తుతం గత మూడు నెలల నుంచి కక్ష సాధింపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర సర్కార్ పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందిందని , దానిని కప్పి పుచ్చుకునేందుకు తమపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా కట్టుకున్న నివాసాన్ని కాపాడేందు కోసం బుడమనేరు గేట్లు తీశారని , దీంతో విజయవాడను ముంచేశారని కీలక వ్యాఖ్యలు చేశారు వైవీ సుబ్బా రెడ్డి.