జోరుగా బుడమేరు గండ్లు పూడ్చివేత
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – బుడమేరు గండ్ల పూడ్చి వేత పనులు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో జోరుగా సాగుతున్నాయి.
శుక్రవారం మూడవ గండి పూడ్చి వేత పనులు మొదలయ్యాయని తెలిపారు. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్.
గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి సమీక్షించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి తెనాలి బొమ్మినేని హాస్పిటల్ అధినేత బొమ్మినేని దుర్గారాణి రూ.15 లక్షలు, కాటూరి మెడికల్ కాలేజ్ యాజమాన్యం సిబ్బంది కలిపి 10లక్షలు, విజయవాడకు చెందిన ఎన్నారై డాక్టర్ శోభ ఆర్ పొదిల 10 లక్షలు, బిజెపి సీనియర్ నేత పాతూరి నాగభూషణం సోదరుడు శ్రీనివాస్ 5 లక్షలు విరాళంగా ఇచ్చారని ప్రశంసించారు నారా లోకేష్.
యలమంచిలి అరుణ 2 లక్షలు, ఎం మాధురీలత 1.5 లక్షలు, పాతూరి మధుసూదన్ రావు 1 లక్ష, కోట వెంకట భాస్కరరావు 50 వేలు, వి.రామారావు 10 వేలు, సాయి ఫేస్ స్కాన్ సెంటర్ యజమాని అన్నపూర్ణ 25 వేలు, ప్రభు కుమారి 20 వేలు, కవిత 5 వేలు అందజేశారని పేర్కొన్నారు. దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నారా లోకేష్.