జాబ్స్ కు రిజైన్ కాంగ్రెస్ లో జాయిన్
హస్తం బాట పట్టిన వినేష్ ఫోగట్..పునియా
ఢిల్లీ – ప్రముఖ భారతీయ రెజ్లర్లు వినేష్ ఫోగట్ , భజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తాము పని చేస్తున్న రైల్వే శాఖకు ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను ఉన్నతాధికారులకు సమర్పించారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. పార్టీలో చేరేకంటే ముందే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు భజరంగ్ పునియా, వినేష్ ఫోగట్.
ఈ ఇద్దరు రెజ్లర్లు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. మోడీ ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ 2024 అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది వినేష్ ఫోగట్.
ఇదిలా ఉండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగో పాల్, పార్టీ నేత పవన్ ఖేరా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ , ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపక్ బబారియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ ఇద్దరు రెజ్లర్లు.