శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ
ఈవో జె. శ్యామల రావు ..గౌతమి..వీరబ్రహ్మం..చౌదరి
తిరుమల – కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల పుణ్య క్షేత్రం వచ్చే నెల అక్టోబర్ లో నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. ఇప్పటికే టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి.రవి, ప్రెస్, పబ్లికేషన్స్ ప్రత్యేకాధికారి రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.