DEVOTIONAL

నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ

Share it with your family & friends

⁠టీటీడీ ఈవో జె. శ్యామలరావు

తిరుమ‌ల – తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీని పునః ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు.

ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల నాణ్యత పెంచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను పలువురు భక్తులు ప్రశంసించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

 1.⁠ ⁠మోహన్ బాబు – తెలంగాణ

ప్రశ్న : ఆన్లైన్ లో రూ.300/- ఎస్ఇడి టికెట్లు పొందిన భక్తులకు తిరుమలలో వసతి కల్పించండి.

ఈవో : అధికారులతో చర్చించి పరిశీలిస్తాం.

 2.⁠ ⁠భావనారాయణ – గుంటూరు

ప్రశ్న : టిటిడి ఆన్లైన్ డిప్ సిస్టంలో సుప్రభాతం, తోమాల, అర్చన ఒక్కొక్కరికి కాకుండా, కళ్యాణోత్సవంలో ఇద్దరికీ కేటాయిస్తున్న విధంగా, లక్కీ డిప్ లో కూడా కుటుంబ సభ్యులు అందరికి ఇవ్వండి. ఆలయంలోని క్యూ లైన్లలో ఫ్యాన్లు, లైటింగ్ పని చేయడం లేదు.

ఈవో: స్వామి వారి దర్శనం, సేవలకు లక్షలమంది భక్తులు ప్రయత్నిస్తుంటారు. అందరికీ అవకాశం కల్పించేందుకు ఈ విధానంను ప్రవేశపెట్టాం. క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.

3.⁠ ⁠భాస్కర్ – కడప

ప్రశ్న : టీటీడీ డాష్ బోర్డులో వసతి, దర్శనంకు సంబంధించిన సమాచారం బాగుంది. లడ్డూల నాణ్యత కూడా పెరిగింది. మాడ వీధులలో భక్తులు చెప్పులు లేకుండా నడిచేలా చర్యలు తీసుకోండి.
తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో శ్రీవారి సేవకులకు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బులు రిఫండ్ చేయండి.

ఈవో : ధన్యవాదాలు, మడావీదులలో విజిలెన్స్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్న ప్రసాదం కాంప్లెక్స్ లో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. శ్రీవారి సేవకులకు హాల్ నెంబర్- 4 లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం.

 4.⁠ ⁠రాజేష్ – కర్నూలు

ప్రశ్న : 65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు క్యూలైన్లో నడవలేరు, కావున ప్రత్యేకంగా పంపించండి. సుపథం మార్గంలో తాగునీరు, అన్న ప్రసాదాలు అందించడం లేదు.

ఈవో: వయోవృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సుపథం వద్ద అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

 5.⁠ ⁠ప్రదీప్ కుమార్ హైదరాబాద్

ప్రశ్న : పరకామణి సేవ మాదిరిగానే లడ్డు ప్రసాద సేవ ప్రవేశ పెట్టండి.

ఈవో : టిటిడి బోర్డు నిర్ణయం మేరకు లడ్డూ ప్రసాద సేవ రద్దు చేయబడింది.

6.⁠ ⁠రమేష్ బాబు – విశాఖపట్నం

ప్రశ్న : ఆన్లైన్ లో గదులు పొందిన వారికి శ్రీవారి మెట్టు దగ్గర స్కానింగ్ ఏర్పాటు చేయండి.

ఈవో : సిఆర్ఓ వరకు వెళ్ల వలసిన పని లేకుండా, స్కానింగ్ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తాం.

7.⁠ ⁠ప్రవీణ్ – కుప్పం

ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో పొందిన భక్తులు చాలా మంది రావడం లేదు. కావున ఆఫ్ లైన్ లో కూడా ఇవ్వండి. క్యూలైన్లు ఖాళీగా ఉన్న ఎక్కువ దూరం నుండి లోపలికి వదులుతున్నారు.

ఈవో : అంగప్రదక్షిణం టోకెన్లను ఆఫ్ లైన్ లో ఇవ్వలేము. క్యూలైన్లలో దగ్గరగా వదిలేలా చర్యలు తీసుకున్నాం.

8.⁠ ⁠రాఘవేంద్ర వేలూరు

ప్రశ్న : భక్తులకు మెరుగైన కూరగాయలతో భోజనం పెట్టండి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాల్లో ఆఫ్ లైన్ లో కూడా గదులు కేటాయించండి.

ఈవో : తిరుమలకు ప్రతిరోజు 23 రకాల కూరగాయలు వస్తున్నాయి. మెనూ ప్రకారము భోజనం అందిస్తున్నాం.

తిరుపతిలోని విష్ణు నివాసంలో 50 శాతం ఆన్లైన్, 50 శాతం ఆఫ్ లైన్ లో గదులు కేటాయిస్తారు.

9.⁠ ⁠వెంకటేష్ – హైదరాబాద్

ప్రశ్న : కోవిడ్ సమయంలో రద్దు చేసిన తోమల సేవా టికెట్ పునరుద్ధరించండి. తిరుమలలో డయాలసిస్ సౌకర్యం కల్పించండి.

ఈవో: సిఫారసు లేఖలు తగ్గించడం జరిగింది. కోవిడ్ సమయంలో రద్దు చేసిన తోమాల సేవ టికెట్ తిరిగి ఇవ్వడం కుదరదు. డయాలసిస్ ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తాం.

10.⁠ ⁠రవి వైజాగ్

ప్రశ్న : ఆన్లైన్ లో వసతి బుక్ చేసుకున్న తర్వాత, సిఆర్ఓ కార్యాలయంకు వెళ్లకుండా అలిపిరి వద్దే గదులు పొందేలా చర్యలు తీసుకోండి.

ఈవో : వీలు కాదు.

11.⁠ ⁠నవీన్ కుమార్ కర్ణాటక

ప్రశ్న : టిటిడి ప్రతినెల విడుదల చేస్తున్న లక్కీ డిప్ ఆర్జిత సేవలను ఒకేసారి కాకుండా మొదటి, రెండవ, మూడవ, నాలుగో వారాలలో కొద్దికొద్దిగా విడుదల చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.

ఈవో: వీలు కాదు.

12.⁠ ⁠రమణమ్మ వైజాగ్

ప్రశ్న : శ్రీవారి కల్యాణానికి పెళ్లి అయిన మా పిల్లలను అనుమతిస్తారా.

ఈవో : శ్రీవారి కల్యాణోత్సవంలో దంపతులు, పెళ్లి కానీ పిల్లలకు రూ.300/- టికెట్ ద్వారా అనుమతిస్తారు. పెళ్లయిన పిల్లలను అనుమతించరు.

13.⁠ ⁠నారాయణ రాజు – కార్వేటినగరం

ప్రశ్న : అన్నప్రసాద భవనంలో సిబ్బంది భక్తులకు వడ్డించేటప్పుడు సాంబారు, రసం, ఎక్కువగా పోసి వృధా చేస్తున్నారు.

ఈవో : తక్కువగా వడ్డించేలా చర్యలు తీసుకుంటాం.

14.⁠ ⁠మాలతి – హైదరాబాద్

ప్రశ్న : ఎస్వీబీసీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు బాగున్నాయి. అదేవిధంగా ఆన్ లైన్ రేడియో ద్వారా ఉదయం, సాయంత్రం భక్తి పాటలు ప్రసారం చేయండి.

ఈవో : పరిశీలిస్తాం.