తలపతి విజయ్ త్రిష కృష్ణన్ వైరల్
వెంకట్ ప్రభు మార్క్ మూవీ స్పార్క్
హైదరాబాద్ – తమిళ సినీ రంగానికి చెందిన తళపతి విజయ్ , మీనాక్షి చౌదరితో పాటు త్రిష కృష్ణన్ నటించిన గోట్ మూవీ దూసుకు పోతోంది. వసూళ్ల పరంగా తొలి రోజే రికార్డ్ సృష్టించింది. ఎలాంటి రాజకీయ సెటైర్స్ లేకుండా కేవలం కథా పరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకట్ ప్రభు.
తాజాగా విజయ్, త్రిష కలిసి చేసిన డ్యాన్స్ కెవ్వు కేక అనిపించేలా చేస్తోంది. దీంతో తళపతి విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. టాకీసులలో హోరెత్తిస్తున్నారు. సంబురాలలో మునిగి పోయారు.
ఇదిలా ఉండగా ఈసారి ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే ది గోట్ చిత్రం విడుదలైంది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ మూవీకి ఓపెనింగ్స్ నుంచి ఇప్పటి దాకా పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. ప్రధానంగా తమిళనాడులో విజయ్ చిత్రం దుమ్ము రేపుతోంది. కలెక్లన్ల పంట పండిస్తోంది.
అయితే ది గోట్ సినిమాను నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. దీని కోసం ఏకంగా రూ. 400 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో సగానికి పైగా రూ. 200 కోట్లు పారితోషకంగా తళపతి విజయ్ కు ఇచ్చినట్లు టాక్.