వినాయకుడు ఆశీస్సులు ఉండాలి – లోకేష్
తెలుగు వారంతా బాగుండాలని ప్రార్థన
అమరావతి – వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు వారందరూ బాగుండాలని, వారు చేసే పనులకు ఆటంకం కలగకుండా చూడాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో అమరావతిలో ముంపు తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడాలని…బాధిత ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని నారా లోకేష్ కోరారు.
రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు అధిక వర్షాల బారి నుండి సురక్షితంగా బయట పడాలని.. ఆ గణనాధుడుని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఆది దేవుడిగా పూజలు అందుకునే గణనాథుడు తొలి పూజ అందుకుని ప్రజలందరికి శుభాలు కలుగ చేయాలని, ఇబ్బందులు తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని మహా గణపతిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు నారా లోకేష్.