వరద బాధితులకు అండగా వైసీపీ తోడుగా
కార్యకర్తలను అభినందించిన ఎంపీ
అమరావతి – బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలా కుతలం చేసింది. ఇంకా వర్షాల తీవ్రత తగ్గలేదు. ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. జలకళను సంతరించుకున్నాయి.
మరో వైపు బాధితులు సాయం కోసం వేచి చూస్తున్నారు. మానవతా దృక్ఫథంతో దాతలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వరద సహాయక కార్యక్రమాలలో నిమగ్నం అయ్యారు.
ఈ సందర్బంగా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు ఎంపీ విజయ సాయి రెడ్డి. వైసీపీ దళంతో పాటు కేంద్రానికి చెందిన హెచ్ ఏ డీఆర్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తమ నాయకుడు ప్రజా ప్రతినిధులకు చెందిన ఒక నెల వేతనాన్ని వరద బాధితుల సహాయర్థం ప్రకటించారని తెలిపారు.