సీఎంను కలిసిన టీపీసీసీ చీఫ్ గౌడ్
అభినందించిన ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ గా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
ఈ సందర్బంగా సీఎం మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరించారు. ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. 24 ఫిబ్రవరి 1966లో పుట్టారు. ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్ నగర్ . ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1986లో నిజామాబాద్ డీసీసీ చీఫ్ గా ఉన్నారు.
1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పని చేశారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేశారు. 2018లో టికెట్ ఆశించిన ఆయనను కాదని మైనార్టీలకు కేటాయించింది పార్టీ. 2021లో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. 2023లో టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.