వరద బాధితులకు ఆసరా పువ్వాడ భరోసా
బీఆర్ఎస్ ఆద్వర్యంలో సరుకులు పంపిణీ
ఖమ్మం జిల్లా – బంగళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం దెబ్బకు భారీ వర్షాలు తెలంగాణను భయపెట్టింది. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాను దిక్కు లేని దానిగా చేసింది. ఓ వైపు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధితులు లబోదిమంటున్నారు. చాలా మంది ఇంకా నీళ్లలోనే ఉండడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.
ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేకంగా బాధితులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ ఎత్తున నిత్యావసర సరుకులను పంపించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున సహాయం అందజేస్తున్నారు.
మరో వైపు నిత్యావసర సరుకులను బాధితులకు తానే దగ్గరుండి అందజేస్తున్నారు పువ్వాడ అజయ్ కుమార్.