NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల‌కు స‌రుకులు పంపిణీ

Share it with your family & friends

ప‌ర్య‌వేక్షిస్తున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఏపీ అల్లాడుతోంది. ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. ఏర్పాట్ల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగా శ‌నివారం భారీ ఎత్తున వ‌ర‌ద బాధితుల కోసం స‌రుకుల‌తో కూడిన కిట్ ల‌ను పంపిణీ చేశారు. ఎవ‌రైనా అంద‌క‌పోతే వెంట‌నే టోల్ ఫ్రీ నంబ‌ర్ కు చేయాల‌ని సూచించారు సీఎం.

ఇక నిత్యావ‌స‌ర స‌రుకుల‌లో 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళా దుంపలు, లీటరు పామాయిల్ ఏపీ ప్ర‌భుత్వం అంద‌జేస్తోంది.

వీటితో పాటు, నూడిల్స్, బిస్కట్లు, పాలు, వాటర్ బాటిల్స్, పండ్లతో మరో కిట్ కూడా ఇస్తోంది. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు గాను పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ప్యాక్ చేయిస్తోంది న‌గ‌ర పాల‌క సంస్థ‌.

అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ చేస్తున్నారు. వరద బాధితుల పంపిణీకి ప్రత్యేకంగా 5 రకాల తిను బండారాలు సిద్ధం చేస్తున్నారు.