ఏపీని ఆదుకోండి ప్లీజ్ సాయం చేయండి
విన్నవించిన ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం
అమరావతి – అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు , వరదలతో నీట మునిగింది ఏపీ. లక్షలాది ఎకరాలలో పంటలు కోల్పోయింది. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభించింది. ఇంకా జనం నీళ్లల్లోనే ఉన్నారు.
బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు పనులను, సహాయక కార్యక్రమాలను.
వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రంతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అన్నీ కోల్పోయిన ఏపీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కీలక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు.
వరద బాధితులను ఆదుకునేందుకు దాతల విరాళాలను స్వీకరించేందుకు ప్రభుత్వం ‘ఏపీ సీఎం సహాయ నిధి’ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి మనసు ఉన్న దాతలు , వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు శక్తి మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని కోరారు చంద్రబాబు నాయుడు.