DEVOTIONAL

గ‌ణ‌నాథా క‌రుణించు ఏపీని ర‌క్షించు

Share it with your family & friends

పూజా కార్య‌క్ర‌మంలో సీఎం

అమ‌రావ‌తి – వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని నారా చంద్ర‌బాబు నాయుడు తెలుగు వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. శ‌నివారం విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా గ‌ణ‌నాథుడిని మొక్కుకున్నారు. పూజారులు ఆశీర్వ‌చ‌నాలు సీఎంకు అంద‌జేశారు.

విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో విజయవాడలో ముంపు తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడాలని…
బాధిత ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని…
రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు అధిక వర్షాల బారి నుండి సురక్షితంగా బయట పడాలని..
ఆ గణనాధుడుని వేడుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఆది దేవుడిగా పూజలు అందుకునే గణనాథుడు తొలి పూజ అందుకుని ప్రజలందరికి శుభాలు కలుగ చేయాలని, ఇబ్బందులు తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలని మహా గణపతిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు.