హైదరాబాద్ సీపీ ‘కొత్తకోట’ బదిలీ
ఆయన స్థానంలో సీవీ ఆనంద్
హైదరాబాద్ – వినాయక చవితి పండుగ వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తను ఏరికోరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు.
ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిపీగా సేవలు అందించిన సీవీ ఆనంద్ వైపు మొగ్గు చూపారు సీఎం.
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ ఆఫీసర్లకు స్థాన చలనం కలిగింది. హైదరాబాద్ సీపీగా ఆనంద్ కు ఛాన్స్ ఇచ్చారు.
ఇదే సమయంలో ఇప్పటి వరకు సీపీగా విశిష్ట సేవలు అందించిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ ను నియమించారు.
ఇదే సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అంతే కాకుండా పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బదిలీల ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.