DEVOTIONAL

కాణిపాక వినాయ‌కుడికి ఎస్పీ ప‌ట్టు వ‌స్త్రాలు

Share it with your family & friends

స‌మ‌ర్పించిన మ‌ణికంఠ చంద‌న వోలు

చిత్తూరు జిల్లా – రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన శ్రీ‌ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా గ‌ణ నాథుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు.

సెప్టెంబర్ 7 నుండి 27 వరకు 21 రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్, పూతలపట్టు MLA మురళీ మోహన్, ఇతర ఉన్నతాధికారులు, భక్తుల సమక్షంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఆలయ ఈవో, అర్చకులు, వేదపండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శుభాషీస్సులు అందజేశారు. అనంతరం వారు స్వామివారి దివ్య సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తమ భక్తి శ్రద్ధలు వ్యక్తం చేశారు.

ఆ తరువాత, వేద పండితులచే ఆలయంలో అశీర్వ‌చ‌న‌ నిర్వహించబడి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలు స్వీకరించడం జరిగింది ఎస్ప మ‌ణికంఠ చంద‌న‌వోలు.