మంత్రి నిమ్మల పనితీరు సూపర్ – నారా లోకేష్
బుడమేరు గండ్ల పూడిక తీత పనులు పూర్తి
విజయవాడ – ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రశంసలు కురిపించారు. బుడమేరుకు పడిన గండ్లను దగ్గరుండి పూడ్చి వేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు నారా లోకేష్.
రాత్రింబవళ్లు మంత్రి బుడమేరు వద్దనే ఉన్నారని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపు 64 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి చేయించారంటూ పేర్కొన్నారు నారా లోకేష్.
మంత్రి నిమ్మల రామానాయుడు చేయిస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ శభాష్ అంటూ ప్రశంసించారు.
నిన్నటికే రెండు గండ్లు పూడిక జరగగా నేడు మూడోగండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా జరిగిన పనుల తీరును లోకేష్ కు మంత్రి రామానాయుడు వివరించారు.