సీఎం నివాసంలో వినాయక చవితి వేడుకలు
పాల్గొన్న టీపీసీసీ దంపతులు..సీఎం కూతురు..అల్లుడు
హైదరాబాద్ – వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా శనివారం నగరంలోనే అతి పెద్ద వినాయకుడిని ఖైరతాబాద్ లో సందర్శించుకున్నారు. అక్కడ స్వామి వారికి పూజలు చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి స్వగృహానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడికి పూజలు చేసి నమస్కరించారు. ఈ వినాయక చవితి పండుగ కార్యక్రమంలో సీఎం భార్య, కూతురు, అల్లుడు, మనవడుతో పాటు తాజాగా టీపీసీసీ చీఫ్ గా నియమితులైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు భార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొత్తంగా ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మనవడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మారారు. తనంటే సీఎంకు పంచ ప్రాణం. ఇవాళ తన జీవితంలో మరిచి పోలేని రోజు అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడు రాష్ట్రం పట్ల కరుణ చూపాలని, ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు సీఎం. గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని తన నివాసంలో స్వామికి పూజలు చేయడం, స్మరించు కోవడం చెప్పలేని సంతోషాన్ని కలిగించిందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.