NEWSANDHRA PRADESH

నిమ్మ‌ల ప్ర‌య‌త్నం అనిత స‌లాం

Share it with your family & friends

64 గంట‌ల పాటు బుడ‌మేరు గండ్లు పూడ్చివేత

విజ‌య‌వాడ – రాష్ట్రంలో చోటు చేసుకున్న వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ఏపీకి న‌ష్టం పెట్టింది. ఈ సంద‌ర్బంగా బుడ‌మేరుకు గండి ప‌డింది. 64 గంట‌ల పాటు నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు గండి ప‌నుల పూడ్చి వేతపై ఫోక‌స్ పెట్టారు.

మూడు గండ్ల‌ను పూడ్చి వేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. రేయింబ‌వ‌ళ్లు బుడ‌మేరు వ‌ద్ద‌నే ఉన్నారు. ఈ సంద‌ర్బంగా నిమ్మ‌ల రామానాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్.

ఇదే స‌మ‌యంలో మంత్రి సైతం బుడ‌మేరు గండి ప‌డ్డ ప్రాంతాన్ని సంద‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా అష్ట క‌ష్టాలు ప‌డి గండ్లు ప‌డిన ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు ద‌గ్గ‌ర ఉంటూ పూర్తి చేయ‌డం ప‌ట్ల రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

మ‌రో వైపు ఏపీని ఇంకా వ‌ర్షాలు వెంటాడుతున్నాయి. వ‌ర‌ద‌ల ఉధృతి పెద్ద ఎత్తున ముంచెత్తుతున్నాయి. మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు సైతం వ‌ర్ష ప్ర‌భావ ప్రాంతాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉంటూ వ‌చ్చారు.