ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు

ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం

విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్ర‌ప‌తి రాదాకృష్ణ‌న్, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ తో పాటు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, రామ్మోహ‌న్ నాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా విశాఖ నోవాటెల్ లో జరిగిన సీఐఐ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాల (MOUs) సంతకాల కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సహచర మంత్రులు పి. నారాయణ, టీజీ భరత్, సీఎస్ విజయానంద్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జెడ్. శివప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్ల పెట్టుబడుల కోసం మూడు సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని మారిటైమ్ రంగంలో దాదాపు 1300 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్ర‌క‌టించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌.

  • Related Posts

    స్వతంత్ర భరద్వాజ్‌కు ఒక రోజు పోలీస్ కస్టడీ

    న్యూఢిల్లీ : హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు షాక్ త‌గిలింది. ఒక దాడి ఘటనకు సంబంధించి త‌న‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట నిరసన చేపట్టిన కొద్ది గంటలకే…

    బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు కుట్ర : సీఎం

    వికారాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రకు తెర లేపింద‌న్నారు. కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *