పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్ర‌ప్ర‌దేశ్

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌ప‌ట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు చిరునామాగా మారిందని పేర్కొన్నారు. “వన్ మిషన్, వన్ విజన్” అనే విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు, పారిశ్రామికవేత్తలను అతిపెద్ద మార్కెట్‌కు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అగ్రికల్చర్ నుంచి ఏరోస్పేస్ వరకు విభిన్న రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ భరోసా ఇచ్చారు.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వంటి దార్శనిక నాయకుల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7 ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. త్వరలో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. భ‌విష్య‌త్తులో పెద్ద ఎత్తున ఏపీలో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *