పెట్టుబ‌డిదారుల‌కు హైద‌రాబాద్ గ‌మ్య‌స్థానం

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచ వ్యాప్తంగా పెట్టుబ‌డిదారుల‌కు అత్యుత్త‌మ గమ్య స్థాన‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈరోజు ఢిల్లిలో జ‌రిగిన అమెరికా – భార‌త‌దేశం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స‌ద‌స్సులో (#USISPF) ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు.

తెలంగాణ‌లో గ‌త 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్ర‌భుత్వాలకు సార‌థ్యం వ‌హించినా పెట్టుబ‌డుల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని వివ‌రించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ ముఖ ద్వార‌మ‌ని తెలిపారు. జీసీసీల‌కు గ్య‌మ‌స్థానంగా ఉన్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు రావాల‌ని కోరుతూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. మ‌హిళా సాధికారిత‌, నాణ్య‌మైన విద్య‌, యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధితో పాటు మెరుగైన వ‌స‌తులు, అత్యున్న‌త జీవ‌న ప్ర‌మాణాల‌తో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిల‌ప‌డ‌మే త‌న ప్ర‌థ‌మ ప్రాధాన్యత అని ముఖ్య‌మంత్రి స్పష్టం చేశారు.

గ‌త 23 నెల‌ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను సదస్సులో వివ‌రించారు. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తులతో 30 వేల ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశంలోనే నూత‌న న‌గ‌రంగా మారుతుంద‌ని చెప్పారు. మూసీ న‌దీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుంద‌ని వివరించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *