DEVOTIONAL

ఏపీ మంత్రి అనిత ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు

విజ‌య‌వాడ – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్బంగా గ‌ణేశ్ ఉత్స‌వాల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్నీ పది రోజుల క్రిందటే రద్దు చేసామ‌ని చెప్పారు.

ఆదివారం వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు, జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం ప్రకటించామ‌ని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి, ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క అనుమతికి తీసుకోకూడదని స్పష్టంగా చెప్పారు. గణేష్ ఉత్సవ సమితులు ఏ ఒక్క అనుమతికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.