మోసం చేస్తే నిలదీయండి – చంద్రబాబు
చొక్క పట్టుకుని అడగండని అని పిలుపు
విజయవాడ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన సహాయక చర్యలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వరద సహాయక చర్యల్లో మోసం చేస్తే చొక్కా పట్టుకుని నిలదీయండి అని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. ఖర్చు గురించి ఆలోచించకుండా వరద బాధితుల ఇక్కట్లు తీరుస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అందించే నిత్యావసర కిట్లను డిమాండ్ చేసి తీసుకోవాలని సూచించారు. కష్టతరమైనా ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
డబ్బు ఎంతవుతుందనే కంటే, ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రూ. 6880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని చంద్రబాబు వెల్లడించారు.
బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతోందని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎవరైనా మోసగిస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీసి తీసుకోండని, తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అందించే నిత్యావసరాల కిట్లు ఎవరికి అందక పోయినా డిమాండ్ చేసి మరీ తీసుకోండని తెలిపారు. ఇంటింటికీ నిత్యావసరాలు ఇవ్వాలని 75 శాతం మంది కోరుకుంటున్నారని చెప్పారు. కష్టతరమైనా ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇవాళ, రేపట్లో ఇంటింటికీ నిత్యవసరాల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామమని, అర్బన్ కంపెనీకి విజయవాడలో తక్కువ మంది నిపుణులు ఉన్నా, ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారికి అనుసంధానిస్తామని తెలిపారు.
ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకే వివిధ సేవల్ని నిపుణులు ద్వారా అందిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా, వర్చువల్గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ క్యాటగిరీల వారికి రేపటి నుంచి శిక్షణ ఇస్తామన్నారు. వారం రోజులు టార్గెట్గా పెట్టుకుని రేపటి నుంచి ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.
వరద సాయం అందరికీ అందకుండా వైఎస్సార్సీపీ ఏమైనా కొన్ని అసాంఘిక బ్యాచ్లను పంపుతోందా అనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు విషయంలోనూ ఈ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు.