NEWSANDHRA PRADESH

ముంపు ప్రాంతాల‌లో పొంగూరు ప‌ర్య‌ట‌న

Share it with your family & friends

బాధితుల‌ను ఆదుకుంటామ‌ని మంత్రి హామీ

విజ‌య‌వాడ – భారీ ఎత్తున కురుస్తున్న వ‌ర్షాలు ఇంకా ఏపీని వెంటాడుతున్నాయి. మ‌రో వైపు తెలంగాణ వ్యాప్తంగా వాన‌లు దంచి కొడుతున్నాయి. ఈ వ‌ర‌ద ఉధృతి ఏపీని అత‌లాకుత‌లం చేశాయి.

ఓల్డ్ రాజరాజేశ్వరి పేట లో వరద మంపులో ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్య‌టించారు .

మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి బాధితుల ఇంటికి వెళ్లారు .

ఇండ్లలోకి నీరు ఎక్కడి వరకూ ప్రవేశించిందో స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సుమారు రెండు గంటల పాటు వరద నీటిలో పలు ఇండ్లను ప మంత్రి నారాయణ ప‌రిశీలించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగు నీరు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామ‌ని చెప్పారు పొంగూరు నారాయ‌ణ‌.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉందన్నారు. రేపు సాయంత్రానికి ఓల్డ్ ఆర్.ఆర్ పేట లో నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతుందన్నారు.

ఖాళీ స్థలాల్లో నీరు నిలువ ఉన్న చోట్ల మోటార్ల తో తోడి వేస్తున్నామ‌ని తెలిపారు. వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య పనులు జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.