నివాస గృహాలను కూల్చబోం – ఏవీ రంగనాథ్
ఓ వైపు వర్షం మరో వైపు కూల్చివేతలు షురూ
హైదరాబాద్ – ఓ వైపు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి హైదరాబాద్ ను. ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జన జీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో హైడ్రా రంగంలోకి దిగింది.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలను కూల్చి వేసింది. ఇందులో భాగంగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చ బోమంటూ ప్రకటించారు.
కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చబోమంటూ స్పష్టం చేశారు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచించారు . మరో వైపు నగరంలోని పలు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేసింది హైడ్రా.
మాదాపూర్, బోరబండ, బాచుపల్లి ప్రాంతాల్లో హైడ్రా కూల్చి వేసింది అక్రమ నిర్మాణాలను. స్వర్ణపురిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేశారు. కత్వా చెరువు FTLలో ఉన్న శ్రీలక్ష్మీశ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ కూల్చివేశారు. కత్వా చెరువు వద్ద భారీగా మోహరించిన పోలీసులు . ఇదే సమయంలో అమీన్ పూర్ లోనూ హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది.