NEWSTELANGANA

వాల్మీకి స్కాం డైవర్షనే హైడ్రామా

Share it with your family & friends

మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. హైడ్రా అనేది కేవ‌లం తాత్కాలికం మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇదంతా టాపిక్ ను డైవ‌ర్ష‌న్ చేసేందుకే ప్ర‌స్తుత సీఎం ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని కేటీఆర్ ఆరోపించారు.

క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న వాల్మీకి స్కాంలో ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య ప‌ద‌వులు ఉంటాయో ఊడుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు . ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని , వాల్మీకి స్కాంకు సంబంధించి విచార‌ణ‌కు సంబంధించిన నివేదిక బ‌య‌ట‌కు వ‌స్తే అస‌లు వాస్త‌వాలు తెలుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

మొత్తంగా తేలింది ఏమిటంటే వాల్మీకి స్కాంలో త‌మ పేర్లు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకే సీఎం హైడ్రాను ముందుకు తీసుకు వ‌చ్చారంటూ ఆరోపించారు. హైడ్రా కేవ‌లం కొంద‌రికి సంబంధించిన వారి నివాసాల‌ను మాత్ర‌మే కూల్చుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి. ముందు వాల్మీకి స్కాం బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనిని వెంట‌నే జ‌నంలోకి వ‌చ్చేలా చూడాల‌ని సూచించారు .