జర్నలిస్టులకు ప్రజలే ఎజెండా కావాలి
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సమాజహితమే జర్నలిజం అభిమతం కావాలని పిలుపునిచ్చారు. అటువంటి జర్నలిస్టులకు, నిజమైన జర్నలిజానికి ప్రజా ప్రభుత్వం సమున్నతమైన గౌరవాన్ని ఇస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి.
జర్నలిస్టుల క్షేమానికి, సంక్షేమానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. రవీంద్ర భారతిలో జేఎన్జేఎచ్ఎస్ జర్నలిస్టు సంఘానికి భూమి స్వాధీన పత్రాలు అందజేశారు సీఎం.
పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని జర్నలిస్టు హౌసింగ సొసైటీకి అందజేయడం ఆనందం కలిగించిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. జర్నలిస్టులంటే ముందు నుంచీ తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు రావాలని పిలుపునిచ్చారు ఎ. రేవంత్ రెడ్డి. కానీ పక్షపాత బుద్దితో కాకుండా నిజాలను, వాస్తవాలను వెలికి తీసేందుకు జర్నలిస్టులు ప్రయత్నం చేయాలని సూచించారు.