NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల‌కు సీఎం భ‌రోసా

Share it with your family & friends

విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు

విజ‌య‌వాడ – వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను ఆదివారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా బాధితుల‌తో ముచ్చ‌టించారు. వారికి ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న స‌హాయ కార్య‌క్ర‌మాల గురించి వాక‌బు చేశారు.

ఇదిలా ఉండ‌గా విజ‌య‌వాడ లోని కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వరద సహాయ కార్యక్రమాలపై బాధితులతో మాట్లాడారు. యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను సంద‌ర్శించిన అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసిక‌ట్టుగా వ‌ర‌ద‌ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌య‌త్నం చేశాయ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఏర్ప‌డిన న‌ష్టం గురించి అంచ‌నాల‌తో కూడిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను అల‌ర్ట్ చేశామ‌ని అన్నారు. బుడ‌మేరు కు ప‌డిన గండ్ల‌ను చాక‌చ‌క్యంగా పూడ్చి వేసిన‌ట్లు తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు.