ఏపీ వరద బాధితులకు రూ. కోటి విరాళం
చెక్కు అందజేసిన లలిత జ్యూయెలరీ అధినేత
విజయవాడ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు భారీ ఎత్తున దాతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఏపీ వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యింది. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
ప్రముఖ బంగారు నగల వ్యాపారి లలితా జ్యూవెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్. కిరణ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. ఏపీ సీఎం సహాయ నిధికి తమ సంస్థ తరపున రూ. 1 కోటి ప్రకటించారు. సోమవారం విజయవాడలోని కలెక్టరేట్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు.
రూ. కోటికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు కిరణ్ కుమార్. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ కుమార్ ను అభినందించారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని వ్యాపారవేత్తలు, కంపెనీల యజమానులు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు ఏపీ సీఎం. ఇదిలా ఉండగా ఇటు ఏపీలో అటు తెలంగాణలో సైతం విరాళాలు పెద్ద ఎత్తున అందుతున్నాయి. పోటీ పడి ప్రకటిస్తున్నారు.
ఇప్పటి వరకు సినీ రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రూ. 6 కోట్లు ప్రకటించగా, మహేష్ద బాబు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ , తదితర నటులు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు.