ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు – కేటీఆర్
మాజీ మంత్రి సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా సోమవారం స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పేరుతో గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు పడడం ఖాయమని స్పష్టం చేశారు కేటీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడడం ఖాయమని పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని జోష్యం చెప్పారు. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు కేటీఆర్.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ తో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శి కి హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదులను పరిశీలించి ఇరుపక్షాల వాదనలు, పరిశీలన వంటి తేదీలను నిర్ణయించాలని స్పష్టం చేసింది.
తేదీలను నాలుగు వారాల్లోగా హైకోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని పేర్కొంది కోర్టు. నాలుగు వారాల్లోగా ఈ ప్రక్రియ ప్రారంభించక పోతే హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరిస్తుందతని స్పష్టం చేసింది.