NEWSTELANGANA

తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయ‌ణ రావు

Share it with your family & friends

నివాళులు అర్పించిన హ‌రీశ్..వివేకానంద్..ప‌ల్లా

హైద‌రాబాద్ – తెలంగాణ భాష, యాస అభివృద్ధికై కృషి చేసిన వైతాళికుడు కాళోజి నారాయణ రావు అని పేర్కొన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. సెప్టెంబ‌ర్ 9 కాళోజీ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి నివాళులు అర్పించారు హ‌రీశ్ రావుతో పాటు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద‌.

కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని నగరంలోని బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “తెలంగాణ భాష దినోత్సవ” కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా క‌వి కాళోజీ నారాయ‌ణ రావు జ‌యంతి. ఈ సంద్బర్భాన్ని పుర‌స్క‌రించుకుని ట్విట్ట‌ర్ వేదిక‌గా కేసీఆర్ స్పందించారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉంద‌న్నారు కేసీఆర్. ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తి వంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కేసీఆర్ కొనియాడారు.

పుట్టుక, చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు కేసీఆర్.

తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి..సాహితీ వేత్త‌ల‌ను గౌర‌వించు కోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు .

అంతే కాకుండా రాష్ట్ర వైద్య విశ్వ విద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి.