NEWSTELANGANA

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా

Share it with your family & friends

ప్ర‌ధాన ప్ర‌తిపక్షానికి ఇవ్వాల్సిన ప‌ద‌వి అది

హైద‌రాబాద్ – రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం అంటూ ప్ర‌శ్నించారు కేటీఆర్.

ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్ట బెట్టడం ఎక్కడి సంస్కృతి అని నిల‌దీశారు.

గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం భార‌త రాజ్యాంగాన్ని పూర్తిగా కాల రాస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. సంప్రదాయాలను మంట గలుపుతోందిని ఆరోపించారు కేటీఆర్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంద‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

పార్లమెంట్ లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టిన విషయం మరిచారా అని నిల‌దీశారు.

దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం ? రాష్ట్ర అత్యున్నత చట్ట సభలో మాత్రం అన్యాయమా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎక్క‌డైనా భార‌త రాజ్యాంగం నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌విని ప్ర‌తిప‌క్షానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. కానీ రేవంత్ రెడ్డి కావాల‌ని పార్టీ ఫిరాయింపున‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేకు ప‌ద‌వి ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు.