లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ – త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
420 అబద్దాల హామీలతో జనాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్దిని మనం చేసి చూపించామని, అయినా మనల్ని ప్రజలు ఆదరించక పోవడం దారుణమన్నారు కేటీఆర్.
అధైర్య పడకుండా ముందుకు సాగాలని, ఎలాగైనా సరే 17 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచు కోవాలని ఇందులో మీరంతా కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మన పార్టీ కంటే కేవలం 4 లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందన్నారు. ఇంకో ఏడెనిమిది సీట్లు వచ్చి ఉంటే హంగ్ వచ్చేదన్నారు. అతి తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లను కోల్పోయామని చెప్పారు కేటీఆర్.
సోనియా గాంధీ కరెంట్ బిల్లులు కడుతుందని చెప్పారని, అందుకే మనందరి బిల్లులను ఏఐసీసీ చీఫ్ , మాజీ చీఫ్ లకు పంపించాలని కోరారు.