NEWSANDHRA PRADESH

సొమ్మును దానం చేస్తేనే సార్థ‌క‌త

Share it with your family & friends

ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత కిర‌ణ్ కుమార్

హైద‌రాబాద్ – ల‌లితా జ్యూవెల‌ర్స్ సంస్థ అధినేత కిర‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. త‌మ సంస్థ త‌ర‌పున రూ. 1 కోటిని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా రూ. కోటి చెక్కును ఇవాళ అంద‌జేశారు కిర‌ణ్ కుమార్ ఏపీ సీఎంకు. ఈ సంద‌ర్బంగా త‌న వంతు బాధ్య‌త‌గా ఏపీ వ‌ర‌ద బాధితుల కోసం స్పందించ‌డ‌మే కాకుండా విరాళం ప్ర‌క‌టించినందుకు, చెక్కు ఇచ్చినందుకు ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

అనంత‌రం ల‌లితా జ్యూవెల‌ర్స్ అధినేత కిర‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఊరికే రావు.. కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత అనేది ఉంటుంద‌న్నారు. అయినా సంపాదించిన వాటితో మ‌నం ఎక్కడికి తీసుకు వెళ్ల‌లేమ‌ని పేర్కొన్నారు కిర‌ణ్ కుమార్.

74 సంవ‌త్స‌రాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్ట పడుతున్నారని, ఆయ‌న చేస్తున్న ప‌నుల‌ను చూసి తాను విస్తు పోయాన‌ని చెప్పారు . తాను వ‌ర‌ద బాధితుల కోసం రూ. కోటి విరాళంగా ఇచ్చాన‌ని మీ వంతుగా సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు ల‌లితా జ్యూవెల‌రీ సంస్థ అధినేత‌.