వరద బాదితుల కోసం మేఘా భారీ విరాళం
రూ. 5 కోట్ల చెక్కు అందజేసిన మేఘా కృష్ణా రెడ్డి
అమరావతి – మేఘా ఇంజనీరింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ ఉదారతను చాటుకుంది. ఏపీలో చోటు చేసుకున్న వరదల కారణంగా వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఏపీ సీఎం దాతలు స్పందించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సీహెచ్ సుబ్బయ్యతో కలిసి రూ. 5 కోట్ల చెక్కును విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఇదిలా ఉండగా విజయవాడలో వరద బాధితులకు మూడు రొజుల పాటు అల్పాహరం మధ్యాహ్నం రాత్రి భోజనం మంచినీళ్ల బాటిళ్లు అందించింది ఎం ఇ ఐ ఎల్. అంతే కాకుండా విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చి వేతలో కీలకంగా వ్యవహరించింది ఎంఈఐఎల్ యంత్రాంగం.
రూ. 5 కోట్ల విరాళాన్ని అందజేసినందుకు గాను మేఘా ఎండీ కృష్ణా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం చంద్రబాబు నాయుడు.
అంతకు ముందు లలితా జ్యూవెలర్స్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ రూ. కోటి విరాళాన్ని అందజేశారు. అనంతరం లలితా జ్యూవెలర్స్ అధినేత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఊరికే రావు.. కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్ధకత అనేది ఉంటుందన్నారు. అయినా సంపాదించిన వాటితో మనం ఎక్కడికి తీసుకు వెళ్లలేమని పేర్కొన్నారు కిరణ్ కుమార్.
74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం కష్ట పడుతున్నారని, ఆయన చేస్తున్న పనులను చూసి తాను విస్తు పోయానని చెప్పారు . తాను వరద బాధితుల కోసం రూ. కోటి విరాళంగా ఇచ్చానని మీ వంతుగా సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు లలితా జ్యూవెలరీ సంస్థ అధినేత.