NEWSANDHRA PRADESH

విరాళాలు ఇవ్వండి ఏపీని ఆదుకోండి

Share it with your family & friends

పిలుపునిచ్చిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – భారీ వ‌ర్షాల తాకిడికి ఏపీ త‌ల్ల‌డిల్లుతోంది. దిక్కులేనిదిగా మారింది. ఈ సంద‌ర్బంగా పూడ్చ‌లేని న‌ష్టం వాటిల్లింది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. స‌ర్వం కోల్పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇంకా ఏపీ తేరుకోలేద‌ని పేర్కొన్నారు. వరదలతో ప్రజలకు అంతులేని కష్టం.. అపార నష్టం వాటిల్లిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం.

ప్రభుత్వం సర్వశక్తులు సమీకరించుకుని సహాయక చర్యలు చేపడుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాల‌ని, త‌మ‌కు తోచినంత మేర సాయం చేయాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.

విరాళాలను స్వీకరించేందుకు ప్రభుత్వం ‘ఏపీ సీఎం సహాయ నిధి’ని ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి మనసు ఉన్న దాతలు తమ శక్తి మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు పంపించాల‌ని కోరారు.

సీఎం ఇచ్చిన పిలుపుతో ప‌లువురు స్వ‌చ్చంధంగా త‌మ వంతు బాధ్య‌త‌గా స్పందించారు. మేఘా కంపెనీ అధినేత కృష్ణా రెడ్డి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ల‌లిత జ్యూయెల్ల‌రీ అధినేత కిర‌ణ్ కుమార్ రూ. ఒక కోటి విరాళంగా ఇచ్చారు.