లక్ష మంది వరద బాధితులకు వైద్య సాయం
ప్రకటించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
అమరావతి – ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు పని చేస్తున్నారని, విజయవాడ కలెక్టరేట్ ను కేరాఫ్ గా మార్చుకుని అక్కడి నుంచే రాష్ట్రాన్ని మానిటరింగ్ చేస్తున్నారని స్పష్టం చేశారు సత్య కుమార్ యాదవ్.
ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 190 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వరద బాధితులకు వైద్య సాయం చేసినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్ యాదవ్ . వ్యాదులు రాకుండా అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఇప్పటి వరకు 1000 మందికి పైగా సిబ్బంది తమ విధులలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు ఏపీ మంత్రి. అంతే కాకుండా ఎవరికి ఏ ఇబ్బంది ఏర్పడినా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామన్నారు సత్య కుమార్ యాదవ్.