NEWSTELANGANA

పోరాట స్పూర్తి ధిక్కార దీప్తి

Share it with your family & friends

ధీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మ

హైద‌రాబాద్ – వీర నారి చాక‌లి ఐల‌మ్మ వ‌ర్దంతి ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఘ‌నంగా నివాళులు అర్పించారు. స‌ద్దుల బతుక‌మ్మ పండుగ రోజు సెప్టెంబ‌ర్ 26,1895లో వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం క్రిష్టాపురంలో పుట్టారు.

ఆమె పూర్తి పేరు చిట్యాల ఐల‌మ్మ‌. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసిన ధీర వ‌నిత‌. తొలి భూ పోరాటానికి నాంది ప‌లికిన వీర‌మాత‌. సామాజిక ఆధునిక ప‌రిణామానికి నాంది ప‌లికింది. ఇదిలా ఉండ‌గా 2022 నుండి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌లి ఐల‌మ్మ జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తోంది.

ఇక చాక‌లి ఐల‌మ్మ విస్నూర్ దేశ్ ముఖ్ ర‌జాక‌ర్ల అరాచ‌కాల‌పై ఎదురు తిరిగింది. ఎర్ర జెండా ప‌ట్టింది. భూస్వాముల గుండెల్లో నిద్ర పోయింది.

అగ్ర కులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తి కులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.

ఈ భూమి నాది… పండించిన పంట నాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.

అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ తీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌, పోలీస్ పటేల్ ను పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు.

‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది.

ఐల‌మ్మ‌ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. ఆమె పోరాటంతో 10 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి పంపిణీ జ‌ర‌గ‌డం విశేషం.