కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 75,995 కోట్ల రుణం
9 నెలల పాలనా కాలంలో సాధించిన ప్రగతి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయడంలో దూసుకు వెళుతోంది. నిన్నటి దాకా గత బీఆర్ఎస్ ను ఏకి పారేస్తూ వచ్చిన సీఎం ఇప్పుడు చేతులెత్తేశారు. ఏకంగా 9 నెలల కాలంలో ఊహించని రీతిలో భారీ ఎత్తున రుణాలు చేసింది. నాలుగున్నర కోట్ల ప్రజలపై పెను భారం పడనుంది.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి సర్కార్ 9 నెలల కాలంలో రూ. 75,995 కోట్ల రుణాలు చేసింది. ఇవి సరి పోవడం లేంటూ మరో రూ. 1500 కోట్లు కావాలంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బాండ్ వేలం ద్వారా ఈ డబ్బులు రుణంగా తీసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ నెల 3న 1000 కోట్ల అప్పు తీసుకుంది తెలంగాణ సర్కార్ . ఇవి సరిపోవడం లేదంటూ మరో రూ. 1500 కోట్లకు ఎసరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టులో రూ.6,000 కోట్లు, జూలైలో రూ.7,000 కోట్లు రుణాలు తీసుకుంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు బాండ్ల రూపంలో రూ.46,118 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.29,877 కోట్లు మొత్తంగా 9 నెలల్లో రూ.75,995 కోట్లు అప్పుగా తీసుకుంది. పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.