ప్రజలను చంపాలన్నదే జగన్ లక్ష్యం – లోకేష్
ప్రకాశం బ్యారేజీని కూల్చాలన్నదే ప్లాన్
విజయవాడ – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలని ప్లాన్ చేశాడని మండిపడ్డారు. మంగళవారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
అధికారం అండగా సైకో జగన్.. ఇసుక మాపియా కోసం 50 మందిని చంపేశారని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని మండిపడ్డారు నారా లోకేష్.
పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించి కూల్చేయాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాల్లేకుండా చేయాలనేది కుట్రకు తెర తీశారని ధ్వజమెత్తారు.
లక్షలాది మంది జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్ట బయలైందని అన్నారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగనేనంటూ ఆరోపించారు .
ప్లాన్ అమలు చేసింది వైసీపీ నేతలు తలశిల రఘురాం, నందిగం సురేష్ అని పేర్కొన్నారు. కుట్రలు బయట పడకుండా విష ప్రచారం చేస్తోంది సైకో జగన్ ముఠానేనని అన్నారు.
వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్. త్వరలోనే ఇంకొన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు.