అమ్మ వారి ఉత్సవాలు ఘనంగా చేయాలి
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు రెడీ
విజయవాడ – ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు మంత్రి. కొండ పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు.
అమ్మ వారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్లు విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
గతంలో జరిగిన ఇబ్బoదులను దృష్టిలో ఉంచుకుని అవి పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండ పై నిర్మిస్తున్న రి టైనింగ్ వాల్ పనులను త్వరిత్తగతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు.
దసరా ఉత్సవాల నిర్వాహణ కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో రూపొందించుకుని రావాలని స్పష్టం చేశారు. ఈ సారి అమ్మవారి ఉత్సవాలను గతం లోకన్నా మిన్నగా నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను గెలుచుకో వా లని మంత్రి తెలిపారు.
భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖా కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజ ర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.